● వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి
ఓర్వకల్లు: కార్యకర్తల కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని పాలకొలను గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రామచంద్రుడు ఐదు నెలల క్రితం అకాల మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని కాటసాని రాంభూపాల్‌రెడ్డి పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం కాటసాని స్వగృహంలో రామచంద్రుడు కుటుంబానికి రూ.30 వేలు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం కాటసాని మాట్లాడుతూ.. కార్యకర్తల సంక్షేమానికి ఎల్లప్పుడూ ముందుంటానని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు పార్టీకి బలమైన పునాదులని, వారి కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామన్నారు. రామచంద్రుడు కుటుంబానికి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. జెడ్పీటీసీ రంగనాథ్‌గౌడు, పాలకొలను రమేష్, అక్కిమి హనుమంతరెడ్డి, ఉలిందకొండ రమణారెడ్డి, గుట్టపాడు రామకృష్ణారెడ్డి, పాలకొలను మద్దయ్య, మాబాషా, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.


