● మోటారు సైకిల్ స్వాధీనం
కర్నూలు: నగరు శివారులోని కోడుమూరు రోడ్డులో హోసన్నా మందిరం సమీపాన నివసించే శోభారాణి ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగను నాలుగో పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. శోభారాణి గత నెలలో ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా అనంతపురానికి వెళ్లారు ఇదే అదనుగా భావించిన దొంగ ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి 30 తులాల వెండి ఆభరణాలు, ఇంటి బయట పార్కు చేసిన ఉంచిన ద్విచక్రవాహనం చోరీ చేసి పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దొంగలు తెలంగాణ రాష్ట్రం పరిగి కురుకచెర్లలో నివాసం ఉండే అరుణ్‌కుమార్, యామీన్‌గా గుర్తించారు. కోడుమూరు రోడ్‌లోని రియలెన్స్ మార్ట్ వద్ద యామీన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. అతని వద్ద నుంచి మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకొని నిందితుడిని న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా రిమాండ్‌కు ఆదేశించారు. ఈ కేసులో మరో ముద్దాయి అరుణ్‌కుమార్‌ను అరెస్ట్ చేయాల్సి ఉందని సీఐ విక్రమసింహ తెలిపారు.


