తండ్రి చెంత ఉంటే ప్రతి బిడ్డ మహారాణే.. ప్రతి కొడుకు మహారాజునే. ఎంత కష్టమొచ్చినా.. బిడ్డలకు ఏ లోటు లేకుండా తండ్రి చూసుకుంటాడు. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా పలువురు తమ వాట్సాప్ స్టేటస్‌లో నాన్న ఫొటోలు పోస్టు చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. తమ నాన్న కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రేమను వ్యక్తం చేశారు. మరి కొందరు అందుబాటులో ఉన్న తండ్రికి పాదాభివందనం చేసి ఆశ్వీరాదం తీసుకోగా ఇంకొందరు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అయితే పట్టణంలోని పాత బస్టాండ్‌లో ఒక తండ్రి తన కూతురును అట్ట పెట్టెలు వేసిన బండిపై కూర్చోబెట్టుకొని తీసుకెళుతున్న దృశ్యాన్ని చూసి.. తండ్రి ఉన్న ప్రతి బిడ్డ మహారాణినే అంటూ చర్చించుకున్నారు. – డోన్ టౌన్


