మొహర్రం గుర్రం వచ్చెన్‌..! | - | Sakshi
Sakshi News home page

మొహర్రం గుర్రం వచ్చెన్‌..!

Jun 22 2026 1:18 AM | Updated on Jun 22 2026 1:18 AM

తసామరస్యానికి ప్రతీకగా హిందూ, ముస్లింలు సమైక్యంగా జరుపుకునే మొహర్రం వేడుకల్లో గుర్రాలకు ప్రత్యేకత ఉంది. అశ్వం స్వామివారి వాహనం కావడంతో కానుకగా లోహపు గుర్రాలను సమర్పిస్తారు. కోరినకోర్కెలు నెరవేరిన భక్తులు స్వామివార్లకు మొక్కుబడిగా గుర్రాలను సమర్పించుకుంటారు. తమ స్థోమతను బట్టి తోచినంతగా దగ్గరుండి గుర్రాలను ఎంతో ప్రీతిపాత్రంగా తయారు చేయించుకుంటారు. ఇంటి దగ్గర భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఊరేగింపుగా పీర్లచావిడులకు వచ్చి స్వామివారికి కానుకలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. మొహర్రం ఆరంభంతో శిల్ప కళాకారులకు చేతికి గుర్రాల తయారీ పని దొరికింది. దీంతో కళాకారులు గుర్రాల తయారీలో నిమగ్నమయ్యారు. – పత్తికొండ రూరల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement