కర్నూలు: నగరంలోని బళ్లారి చౌరస్తా సమీపంలో ఉన్న కేశవ గ్రాండ్ హోటల్ వద్ద సిటీ కేఫ్‌లో ఈ నెల 16వ తేదీన రియల్ ఎస్టేట్ వ్యాపారి పాతబస్తీ గరీబ్‌నగర్‌కు చెందిన నవీద్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులను నాలుగో పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. తన మిత్రులు మహబూబ్‌బాషా, బీసన్నతో కలిసి కర్నూలు సిటీ కేఫ్‌లో మాట్లాడుతుండగా, ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా హోటల్‌లోకి ప్రవేశించి నవీద్‌ను చంపాలనే ఉద్దేశంతో కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో స్నేహితులు ఆయనను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షి మహబూబ్‌బాషా ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన నాలుగో పట్టణ పోలీసులు నవీద్ ఇంటి సమీపంలో నివసిస్తున్న గుజిరి సామాన్ల వ్యాపారం చేసే షేక్షా, అతని అన్న కుమారుడు అబ్దుల్ రహిమాన్, అక్క కొడుకు రెహాన్‌ను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారు దాడికి ఉపయోగించిన రెండు కత్తులు, ఒక ఆటోను సీజ్ చేసి నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా, రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. వారిని పంచలింగాల జిల్లా కారాగారంలో అప్పగించినట్లు తెలిపారు. నవీద్, షేక్షా మధ్య ఎల్కూరు బంగ్లా వద్దగల ఐదు సెంట్ల ప్లాట్ విషయంలో జరిగిన లావాదేవీల్లో వచ్చిన మనస్పర్థలే హత్యాయత్నానికి దారి తీసినట్లు దర్యాప్తులో తేలిందని సీఐ తెలిపారు.


