గంగమ్మ చనిపోయినా, ఆమె ప్రియుడు బ్యాగారి దర్గప్ప ఇంకా పోలీసు కస్టడీలోనే చికిత్స పొందుతున్నాడు. పోలీసు కస్టడీలోని బ్యాగారి దర్గప్పకు ఈ పరిస్థితి ఎవరు కల్పించారు. కనీసం లేవలేని స్థితికి ఎవరు చేర్చారు. దాదాపు నెల రోజులుగా చేతులు సచ్చుపడిపోయి శరీరంలోని అవయవాలు దెబ్బతినేంతగా ఎవరు కొట్టి ఉంటారు? పోలీసు సదన్‌లో ఉంచి వైద్యం అందిస్తున్న పోలీసులు మరే కొత్త కథను అల్లుతున్నారోననే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అతని చేతులు పనిచేయడం లేదని తెలుస్తోంది. కాళ్లు సెప్టిక్ కాగా, శరీరంలోని అంతర్గత అవయవాలు(కిడ్నీ, లివర్ తదితరాలు) చాలా పనిచేయడం లేదని సమాచారం. వెంటిలేటర్ అవసరం లేకపోవడంతో పోలీస్ సదన్‌లో గోప్యంగా చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది.


