నీట్‌ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత | - | Sakshi
Sakshi News home page

నీట్‌ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత

Jun 21 2026 6:28 AM | Updated on Jun 21 2026 6:28 AM

కర్నూలు: నీట్‌ పునఃపరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. ఆదివారం నిర్వహించనున్న నీట్‌ పరీక్ష నేపథ్యంలో జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని పెరేడ్‌ మైదానంలో బందోబస్తు విధులకు హాజరైన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. ప్రతి కేంద్రం వద్ద సీఐ స్థాయి అధికారితో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాల రవాణా సమయంలో సివిల్‌ పోలీసులతో పాటు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందితో ఎస్కార్ట్‌ ఏర్పాటు చేశామన్నారు. మొబైల్‌ ఫోన్లు, ఐప్యాడ్‌లు, ల్యాప్‌టాప్‌లు, బ్లూటూత్‌, ఇయర్‌ ఫోన్లు తదితర ఎలక్ట్రానిక్‌ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరాదని సూచించారు. అడిషనల్‌ ఎస్పీలు హుసేన్‌ పీరా, కృష్ణమోహన్‌, డీఎస్పీ రాఘవేంద్ర, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement