ఆళ్లగడ్డ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

ఆళ్లగడ్డ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మృతి

Jun 21 2026 6:28 AM | Updated on Jun 21 2026 6:28 AM

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పురపాలక సంఘం మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ రామలింగారెడ్డి (87) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామలింగారెడ్డి శనివారం మధ్యా హ్నం తన నివాస గృహంలో ఉన్నట్టుండి కుప్ప కూలి పోయి మృతి చెందారు. సుదీర్ఘకాలం ఆళ్లగడ్డలో ఆసుపత్రి ఏర్పాటు చేసి డాక్టర్‌గా సేవలందించడంతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా, చైర్మన్‌గా ఎన్నికై ఆళ్లగడ్డ పట్టణంతో పాటు నియోజకవర్గ ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. రామలింగారెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంట్‌ పరిశీలకులు గంగుల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిలతో పా టు పలువురు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంతాపం వ్యక్తం చేశారు.

మద్దిలేటయ్య కిటకిట

బేతంచెర్ల: వైష్ణవ పుణ్య క్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయం శనివారం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. జ్యేష్ట మాసం శుభ దినాల నేపథ్యంలో జిల్లా నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా ఆలయ ఉప కమిషనర్‌ రామాంజనేయులు చర్యలు చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement