● డిప్యూటీ జనరల్ మేనేజర్ హేమ వెల్లడి
కర్నూలు(అగ్రికల్చర్): ఎస్‌బీఐ ఉద్యోగుల సంక్షేమానికి దివంగత కార్మిక నాయకులు వై.తారకనాథ్ ఎంతో కృషి చేశారని ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.హేమ అన్నారు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ కర్నూలు మాడ్యుల్ ఆధ్వర్యంలో వై.తారకనాథ్ 22వ వర్ధంతి సందర్భంగా శనివారం వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, బేతంచెర్ల, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ ఎస్‌బీఐ శాఖల్లో రక్తదాన శిబిరాలు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు అవసరమైన సామగ్రి పంపిణీ చేశారు. కర్నూలులోని డాక్టర్ వైఎస్సార్ సర్కిల్‌లోని మెయిన్ బ్రాంచ్‌లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.హేమ ప్రారంభించారు. కర్నూలులో 70 మంది, ఎమ్మిగనూరులో 80 మంది, ఇతర పట్టణాల్లో 51 మంది ప్రకారం రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ స్టాఫ్ యూనియన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ విద్యాసాగర్, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ పి.శ్రీకాంత్, నాయకులు ప్రవీణ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.


