సొంతబ్యాగులు వేసుకొని వెళుతున్న విద్యార్థులు
పాతబ్యాగుతోనే
పాఠశాలకు వచ్చిన విద్యార్థి
చిరిగిన బ్యాగుకు పిన్నీసు పెట్టుకుని..
పేద విద్యార్థులనో.. నోరెత్తి అడగలేరనో.. తెలియదు కానీ.. కూటమి సర్కారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పట్ల చిన్న చూపు చూస్తోంది. 2026–27 విద్యా సంవత్సరంలో పాఠశాల తెరవగానే విద్యాకిట్లు ఇస్తామన్న కూటమి పాలకుల ప్రకటనలు ఒట్టిమాటలయ్యాయి. కేవలం పుస్తకాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో విద్యార్థులు చిరిగిన, పాత బ్యాగులతోనే బడికి వస్తున్నారు. ప్రభుత్వ తీరును విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. బడులు తెరిచి రోజులు గడుస్తున్నాయని, పూర్తి స్థాయిలో కిట్లు ఇంకెప్పుడిస్తారని మండిపడుతున్నారు.
– మద్దికెర


