జూలై 11న లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

జూలై 11న లోక్‌ అదాలత్‌

Jun 19 2026 1:24 AM | Updated on Jun 19 2026 1:24 AM

కర్నూలు: కోర్టులలో ఉన్న సివిల్‌, భూసేకరణ, పన్ను బకాయిలు, మున్సిపల్‌ కేసులు జులై 11న నిర్వహించనున్న లోక్‌ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సూచనల మేరకు మున్సిపల్‌, సచివాలయ, కెనరా లీడ్‌ బ్యాంక్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులతో స్థానిక ప్రాంగణంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కోర్టులలో ప్రీ లోక్‌ అదాలత్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కక్షిదారులు తమ కేసులను రాజీపూర్వకంగా పరిష్కరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో భూసేకరణ, బ్యాంకు, మున్సిపల్‌, సచివాలయ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement