బనగానపల్లె రూరల్: ఫర్టిలైజర్ దుకాణం డీలర్లు విలువలతో కూడిన వ్యాపారం చేస్తూ వ్యవసాయాభివృద్ధికి తోడ్పాటునందించాలని ఏడీఆర్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఎం,జాన్సన్ సూచించారు. మంగళవారం మండలంలోని యాగంటిపల్లె గ్రామ సమీపంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో సీనియర్ శాస్త్రవేత్త ధనలక్ష్మీ అధ్యక్షతన వ్యవసాయ ఇన్‌పుట్ డీలర్స్ 2024–25వ సంవత్సరం ఉత్తీర్ణత పొందిన డీలర్లకు డిప్లొమా పట్టా పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న డైరెక్టర్ జాన్సన్ మాట్లాడుతూ.. డీలర్లు నేర్చుకున్న వ్యవసాయ పరిజ్ఞానాన్ని రైతాంగానికి చేరవేయాలని, రైతులకు సమయానుకూల వ్యవసాయ సూచనలు, సలహాలు ఇచ్చి పెట్టుబడి తగ్గించాలన్నారు. ఎరువులు, పురుగు మందులు, పంటను చూసి రైతులకు నాణ్యమైన మందులను సిఫార్సు చేయాలన్నారు. ఆత్మ పీడీ బాలాజీనాయక్, దేశీ కార్యక్రమ సమన్వయ కర్త విశ్వనాథ్‌రెడ్డి, కేవీకే ఏఈ సురేష్‌కుమార్ శాస్త్రవేత్తలు, డీలర్లు పాల్గొన్నారు.


