నాటు కోళ్ల పెంపకం లాభదాయకం
ఎమ్మిగనూరురూరల్: గ్రామీణలు నాటు కోళ్లను పెంచుకుంటే లాభదాయకంగా ఉంటుందని కేవీకే సమన్వయకర్త డా. రాఘవేంద్రచౌదరి పేర్కొన్నారు. బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో నాటు కోళ్ల పెంపకంపై ఏర్పాటు చేసిన శిక్షణ మంగళవారం ముగిసింది. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నాటు కోళ్ల పెంచుకోవటం వలన కోడి గుడ్లతో పాటు కోళ్లను విక్రయించుకోవచ్చునని తెలిపారు. అయితే, కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఏమైనా వ్యాధి సంక్రమిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలన్నారు. అనంతరం శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్స్, నాటు కోళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నార్మ్ ప్రిన్సిపల్ సైంటిస్టు డా. నిర్మల, డా. సుప్రియ తదితరులు పాల్గొన్నారు. అలాగే తెనే టీగల పెంపకం చేస్తున్న వారికి వాటిపై అవగాహన కల్పించి తేనేటీగ పెట్టెలు అందజేశారు.జాతీయ ఆహార భద్రత పథకం కింద ఎంపిక చేసిన రైతులకు నూనె గింజల పంటల్లో భాగంగా వేరుశనగ విత్తనాలు అందజేశారు.


