పంట కాల్వలో పడి..
గోస్పాడు: మండలంలోని సాంబవరం గ్రామంలో ఓ వ్యక్తి పంట కాల్వలో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నందవరం పుల్లయ్య (55) మతిస్థితిమితం సక్రమంగా లేక గత 15 రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. మంగళవారం పంట కాల్వలో పడి ఉండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.


