
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి
కర్నూలు (టౌన్): నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఆదివారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆయా పోలీసు స్టేషన్లలో పోలీసులు రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే తప్పనిసరిగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
నాటు సారా తరలిస్తూ ఇద్దరు అరెస్టు
నవోదయం కార్యక్రమంలో భాగంగా ఎకై ్సజ్ పోలీసులు ఆదివారం కల్లూరు మండలం ఉల్లిందకొండ నుండి డోన్ వైపు వెళ్లే రహదారి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. కొల్లం పల్లి తండాకు చెందిన భూక్య గోపాల్ నాయక్, బస్తి పాడు గ్రామానికి చెందిన పురుషోత్తంలు ద్విచక్రవాహనంపై 20 లీటర్ల నాటు సారా తరలిస్తూ పట్టుబడ్డారని ఎకై ్సజ్ అధికారులు రాజేంద్ర ప్రసాద్, నవీన్ బాబు వెల్లడించారు. వీరిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్