
బలహీన వర్గాల సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక
కర్నూలు(అర్బన్): బడుగు, బలహీన వర్గాల సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నికై ంది. ఆదివారం స్థానిక రాముల దేవాలయంలో జరిగిన సమావేశంలో కమిటీ రాష్ట్ర చైర్మన్‌గా ఎన్‌డీ కృష్ణోజీరావు, వైస్ చైర్మన్‌గా బేతం కృష్ణుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నాగప్ప, మాదన్న, పీ వెంకటేశ్వర్లు, కే వెంకటేశ్వర్లు, శేషిరెడ్డి, ఈరాబాయి ఎన్నికయ్యారు. అలాగే జిల్లా అధ్యక్షులుగా జీ పుల్లంరాజు, ఉపాధ్యక్షులుగా మోహిద్దీన్‌బాషా, కార్యవర్గ సభ్యులుగా ఎస్‌ఎస్ రావు, పీ వసంతరావు, గఫూర్, వెంకటరమణ, శ్రీనివాసులు, బుజ్జిబాబు, నరసింహులును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్ కృష్ణోజీరావు మాట్లాడుతూ.. తమ సంఘం ఆధ్వర్యంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలను చేపట్టనున్నామన్నారు. గత కొంత కాలంగా రాష్ట్ర కార్యవర్గం లేని కారణంగా సంఘం కార్యకలాపాలు స్తబ్దుగా ఉన్నాయని, ఇక నుంచి తరచూ సమావేశాలను నిర్వహించి సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమాలను చేపడతామన్నారు.