
భార్యను చూడటానికి వస్తూ మృత్యు ఒడికి!
ఆస్పరి: తొమ్మిది నెలల గర్భవతి అయిన భార్యను చూడటానికి బైక్‌పై వస్తూ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ దుర్ఘటన మండలంలోని కైరుప్పల గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆస్పరి సీఐ మస్తాన్‌వలి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు మేరకు.. కై రుప్పల గ్రామానికి చెందిన శ్రీనివాసులు (31) నగరూరు గ్రామానికి చెందిన పూజను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కూతురు సౌమ్య ఉంది. ప్రస్తుతం పూజ తొమ్మిది నెలలు గర్భిణి. శ్రీనివాసులు నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం రాత్రి ఆత్మకూరు నుంచి భార్యను చూడటానికి స్కూటర్‌పై నగరూరు గ్రామానికి బయలు దేరారు. శనివారం రాత్రి మండలంలోని అట్టెకల్లు గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున అట్టెకల్లు గ్రామానికి చెందిన రైతులు పొలాలకు వెళ్తూ ఈ సంఘటనను చూసి బంధువులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి వెళ్లి భార్య, కూతురు, కుటుంబ సభ్యులు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని
వ్యక్తి దుర్మరణం

భార్యను చూడటానికి వస్తూ మృత్యు ఒడికి!