
పెద్దపులి సంరక్షణలో ముందడుగు
పెద్దపులి సంరక్షణ కోసం అన్నిరకాల చర్యలు చేపట్టడంలో ముందడుగులో ఉన్నాము. పులి ఆహార జంతువులకు ఆహార కొరత లేకుండా 200 హెక్టార్లలో గడ్డి మైదానాలను అభివృద్ధి పరుస్తున్నాం. నీటి కొరత లేకుండా నీటి వనరుల పర్యవేక్షణ జరుగుతోంది. ఎన్‌ఎస్‌టీఆర్ పరిధిలో 80 నీటి కుంటల్లో పూడిక తీయించాం. పులుల సంఖ్య పెరుగుతున్నందువల్ల వాటి ఆహార జంతువుల నిష్పత్తి తగ్గకుండా బయటి ప్రాంతాల్లోంచి చుక్కల దుప్పులు, కణుతులను పూర్తి ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అడవిలో వదులుతున్నాం. ఇప్పటికే కాకినాడలోని నాగార్జున ఎరువుల కర్మాగారం వారి సంరక్షణలో ఉన్న దుప్పులను, కణుతులను, సత్యసాయిబాబా ట్రస్ట్ పరిధిలో ఉన్న హరిణి వనాల్లోని జింకలు అడవుల్లో వదలడానికి సిద్ధం చేశాం.
– వి సాయిబాబా, డిప్యూటీ డైరెక్టర్,
పాజెక్ట్ టైగర్, ఆత్మకూరు
●