జీడీపీలోకి ‘హంద్రీ–నీవా’ నీరు | - | Sakshi
Sakshi News home page

జీడీపీలోకి ‘హంద్రీ–నీవా’ నీరు

Jul 29 2025 8:14 AM | Updated on Jul 29 2025 8:14 AM

జీడీప

జీడీపీలోకి ‘హంద్రీ–నీవా’ నీరు

గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ)కు ఆదివారం రాత్రి నుంచి హంద్రీ– నీవా నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ఏఈ మహమ్మద్‌ ఆలీ మాట్లాడుతూ.. హంద్రీ– నీవా కాలువ నుంచి 60, ఎల్లెల్సీ నుంచి 60 క్యూసెక్కుల నీరు నీరు జీడీపీలోకి వచ్చి చేరుతోందన్నారు. జీడీపీ సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా.. సోమవారం సాయంత్రానికి 1 టీఎంసీలకు చేరిందన్నారు. కోడుమూరు పట్టణానికి తాగునీటి కోసమని జీడీపీ ఎడమ కాలువ ద్వారా 30 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు చెప్పారు.

పింఛన్ల పంపిణీకి రూ.196.7 కోట్లు

కర్నూలు(అగ్రికల్చర్‌): ఎన్‌టీఆర్‌ భరోసా పెన్షన్‌ కింద ఆగస్టు నెలకు ఉమ్మడి జిల్లాలో 4,55,491 పింఛన్లకు రూ.196.7 కోట్లు మంజూరయ్యాయి. రెండు నెలలుగా ఊరిస్తున్న స్పౌజ్‌ పింఛన్లను కూడా ఆగస్టు నెలలో ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ కారణంగా పింఛన్ల సంఖ్య కొంత మేర పెరిగింది. ఈ నెల 31న పింఛన్ల నిధులు బ్యాంకులకు విడుదల కానున్నాయి.

అహోబిలంలో వైభవంగా

తిరువాడిప్పూరం ఉత్సవం

ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో తిరువాడిప్పూరం ఉత్సవం వైభవంగా నిర్వహించారు. సోమవారం వేకువ జామునే దిగువ అహోబిలంలో కొలువైన మూలవిరాట్‌ శాంతమూర్తి శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్ల్లతో పాటు గోదాదేవి అమ్మవార్లను సుప్రభాతసేవతో మేలుకొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గర్భగుడి ఎదురుగా ఏర్పాటు చేసిన యాగశాలలో ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీప్రహ్లాదవరదస్వాములను, గోదాదేవి అమ్మవారికి ఎదురుగా కొలువుంచారు. వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య నవకలశ స్థాపన, అర్చన, అభిషేకం, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టువస్త్రాలు, మేనిమి ఆభరణాలతో అలంకరించి కొలువుంచా రు. రాత్రి స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన అద్దాల మండపంలో శ్రీ గోదాదేవి, ప్రహ్లాదవరదుల కల్యాణం నిర్వహించారు. ఆ తర్వాత పల్లకీలో కొలువుంచి గ్రామోత్సవం చేపట్టారు. ముద్రకర్త కీడాంబి వేణుగోపాలన్‌, మణియార్‌ సౌమ్యానారాయణ్‌, అర్చకులు ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహించారు.

శ్రీగిరి కిటకిట

శ్రీశైలంటెంపుల్‌: శ్రావణమాస తొలి సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మల్లన్న దర్శనానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్‌ వద్దకు చేరుకున్నారు. ఉచి త, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నా రు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్ని కిటకిటలాడాయి.

జీడీపీలోకి ‘హంద్రీ–నీవా’ నీరు 1
1/2

జీడీపీలోకి ‘హంద్రీ–నీవా’ నీరు

జీడీపీలోకి ‘హంద్రీ–నీవా’ నీరు 2
2/2

జీడీపీలోకి ‘హంద్రీ–నీవా’ నీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement