
మీ అభిమానం ‘పచ్చగుండ’!
వైఎస్సార్‌సీపీ పట్ల, ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల చెరగని అభిమానానికి ఈ దృశ్యం అద్దం పడుతుంది. గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఆ రూపం ఎంత పదిలంగా ఉందో ఈ సామాన్య రైతును కదిలిస్తే అర్థమవుతుంది. పత్తికొండ నియోజకవర్గంలోని చక్రాళ్ల గ్రామ సమీప పొలాల్లో పని చేసుకుంటున్న ఇతని పేరు రంగ నాయుడు. పార్టీ అధికారంలో లేకపోయినా అభిమాన నాయకుడి రూపంతో కూడిన టీ షర్ట్ ధరించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ‘ రాజు బలవంతుడైనప్పుడే శత్రువులంతా ఏకమవుతారు..’ అనే కొటేషన్‌తో కూడిన టీ షర్ట్ తన అభిమాన నేత గురించి ఆ నిరుపేద రైతు మనసులోని అభిమానం స్థాయిని చాటుతోంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు