
ఆస్పరి పీహెచ్‌సీలో సౌకర్యాలు లేవు
ఆస్పరి పీహెచ్‌సీలో రోగులకు కనీస సౌకర్యాలు లేవు. కనీసం గర్భిణులకు పడకలు కూడా సరిపోవడం లేదు. ఆస్పరి మండలంలోని దాదాపు 25 గ్రామాల నుంచే గాకుండా దేవనకొండ, ఆలూరు, పత్తికొండ మండలాలకు చెందిన గ్రామాల వారు సైతం పలు వ్యాధులకు చికిత్స కోసం, ప్రసవాల కోసం ఇక్కడికే వస్తున్నారు. గర్భిణులకు పరీక్షల ల్యాబ్ లేకపోవడంతో ఆదోనికి వెళ్తున్నారు. వారికి ఇక్కడే ల్యాబ్ ఏర్పాటు చేయాలి. – రామాంజనమ్మ,
చిరుమాన్‌దొడ్డి, ఆస్పరి మండలం
అవగాహన కల్పిస్తున్నాం
వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. పీహెచ్‌సీలు, యుపీహెచ్‌సీలు, సచివాలయాలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో మలేరియా వ్యాధినిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. జ్వరం వచ్చిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. మలేరియా/డెంగీ నిర్ధారణ అయితే వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి. మలేరియా, డెంగీ జ్వరాలు రాకుండా ఉండేందుకు ఇళ్లు, పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. –నూకరాజు,
జిల్లా మలేరియా అధికారి, కర్నూలు
●

ఆస్పరి పీహెచ్‌సీలో సౌకర్యాలు లేవు