
ఆదాయ లక్ష్య సాధనపై దృష్టి పెట్టండి
కర్నూలు: జిల్లా రవాణా శాఖకు కేటాయించిన ఆదాయ లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలని రీజనల్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి జిల్లా రవాణా శాఖ అధికారులకు సూచించారు. త్రైమాసిక తనిఖీలో భా గంగా మంగళవారం ఆమె జిల్లా పర్యటనకు వచ్చారు. కర్నూలు మండలం తాండ్రపాడు గ్రామ శివారులో ఉన్న ఉప కమిషనర్ కార్యాలయానికి చేరుకోగానే డీటీసీ ఎస్.శాంతకుమారి,ఆర్‌టీఓ ఎల్.భరత్ చవాన్, ఏఓ వెంకట కుమార్ తది తరులు ఆమెకు పూల బొకే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో అధికారులతో సమావేశమై రవాణా శాఖ పురోగతిపై చర్చించారు. రికార్డులను పరిశీలించి లక్ష్యసాధనకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అడిగి తెలు సుకున్నారు. పన్ను వసూళ్లు, వాహనాల అమ్మకాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ తదతరా ల ద్వారా ఎంత ఆదాయం సమకూరింది, త్రైమాసిక పన్నులు సక్రమంగా వసూలయ్యాయా? పన్నులు చెల్లించకుండా తిప్పుతున్న వాహనదారులకు ఎంతమందికి నోటీసులు జారీ చేశారు, ఎన్ని వాహనాలు సీజ్ చేశారు తదితర అంశాలపై కూలంకుశంగా చర్చించారు. అలాగే రోడ్డు భద్రతపై శాఖాపరంగా తీసుకుంటు న్న చర్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఎంవీఐలు రవీంద్ర కుమార్, సుధాక ర్‌రెడ్డి, ఏఎంవీఐలు బాబు కిషోర్, గణేష్ బాబు సమావేశంలో పాల్గొన్నారు.
నేడు నంద్యాల...
జిల్లాలో ఐదు రవాణా శాఖ కార్యాలయాలు ఉండగా.. మొదటి రోజు కర్నూలు, ఆదోని కార్యాలయాల్లో ఆమె తనిఖీలు పూర్తి చేశారు. నంద్యాలలో ఆర్‌టీఓ కార్యాలయం, డోన్, ఆత్మకూరులో ఎంవీఐ కార్యాలయాలు ఉన్నాయి. బుధవారం ఆయా కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.