
‘ఫ్రీజింగ్’తో ముప్పుతిప్పలు
పాత వాహనానికి యజమాని వివరాలు మార్పు చేయాలన్నా ఇక్కడ డబ్బులు ముట్టజెప్పాల్సిందే. వాహనం ఇతర జిల్లాలకు అమ్మిన సమయంలో ఇచ్చే క్లియరెన్స్ సర్టిఫికెట్లు (అనుమతి పత్రాలు)కు కూడా ముడుపులు ముట్టజెప్పాల్సిందే. లేదంటే వారం, రెండు వారాల పాటు తిప్పుకుంటూ ఆన్‌లైన్‌లో ‘ఫ్రీజింగ్’లో పెట్టి దరఖాస్తుదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. వాహన యాజమాన్యం హక్కుల మార్పు, అనుమతుల పొడిగింపు, ఈ–కేవైసీ, మండల మ్యాపింగ్, టెలిఫోన్ నెంబర్ అప్‌డేషన్ తదితర వాటికి కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారు.