
పేలిన గ్యాస్ సిలిండర్.. దగ్ధమైన దుకాణాలు
ఓర్వకల్లు: వంట గ్యాస్ సిలిండర్ పేలడంలో రెండు దుకాణాలు దగ్ధమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఓర్వకల్లులో జరిగిన ఈ దుర్ఘటనలో ఆస్తి నష్టం వాటిల్లింది. బాధితులు, స్థానికుల తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని కెనరా బ్యాంక్ ఎదురుగా దుకాణాలను అద్దెకు తీసుకొని ఉస్తేపిల్లి వెంకటేశ్వర్లుశెట్టి, నందికొట్కూరుకు చెందిన శేషఫణి శెట్టి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత వెంకటేశ్వర్లుశెటిక్టి చెందిన శ్రీరామబేకరీలో వంట గ్యాస్ సిలిండర్ పేలింది. పక్కనే పున్న రెండు ఫ్రిడ్జ్‌లకు వ్యాపించడంతో అందులోని కూలర్ గ్యాస్‌ను దట్టమైన మంటలు వీచాయి. దీంతో దుకాణంలోని బేకరి వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికాలు దగ్ధమయ్యాయి. ఈ మంటలు పక్కనే పున్న శేషఫణిశెట్టికి చెందిన లక్ష్మీ ఎలక్ట్రికల్ దుకాణంలోకి వ్యాపించాయి. అందులోని ఎలక్ట్రానిక్ పరికరాలు, ప్లంబర్ సామాన్లు, ప్లాస్టిక్ పైపులు కాలి బాడిదయ్యాయి. ప్రమాదం కారణంగా బేకరీలో రూ.4 లక్షలు, ఎలక్ట్రికల్ దుకాణంలో రూ.8 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద తీరును పరిశీలించారు.

పేలిన గ్యాస్ సిలిండర్.. దగ్ధమైన దుకాణాలు