శోచనీయం
గ్రామాల అభివృద్ధిని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 2వ విడత 15వ ఆర్థిక సంఘం నిధులు నేటికీ విడుదల కాకపోవడం దారుణం. మండల పరిషత్తుకు విడుదలయ్యే ఈ నిధులతో పలు అభివృద్ధి పనులు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. నేటికీ ఎంపీపీ, ఎంపీటీసీలకు కూడా గౌరవ వేతనాలు కూడా విడుదల చేయకపోవడం శోచనీయం.
– నారాయణదాస్, ఎంపీపీ, పత్తికొండ
గ్రామాభివృద్ధి కుంటుపడింది
మేజర్ గ్రామ పంచాయతీల్లో పలు రకాల ఆదాయ వనరులు ఉన్న కారణంగా ప్రజలకు అవసరమైన పనులు చేసేందుకు అవకాశం ఉంటుంది. మాలాంటి మైనర్ గ్రామ పంచాయతీల్లో ఎలాంటి ఇతర ఆదాయ వనరులు లేవు. పాలక ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కాకపోవడంతో గ్రామాభివృద్ధి కుంటుపడింది. గ్రామంలో బోర్ల మరమ్మతులు, పైప్ లైన్ల రిపేర్లను చేపట్టలేక పోతున్నాం. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.
– సుమతీరెడ్డి, సర్పంచ్,
కమ్మరచేడు, ఆలూరు మండలం
పంచాయతీలకు ఆర్థిక
సంఘం నిధులే ఆధారం ...
గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులే ఆధారం. సకాలంలో ఈ నిధులు విడుదలైతే గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. ఎలాంటి ఇతరత్రా ఆదాయ వనరులు లేని గ్రామ పంచాయతీల్లో ప్రస్తుత వర్షాకాలంలో వీధుల్లోని రోడ్లపై బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా వీలు లేని పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం 2వ విడత నిధులు విడుదలయ్యేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. – బీ మద్దిలేటి, సర్పంచ్,
సల్కాపురం, కల్లూరు మండలం
శోచనీయం
శోచనీయం


