ఉద్యమం చేస్తాం
బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రభు త్వం బకాయి పడిన ఫీజులను విడుదల చేసేంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. ఫీజు బకాయిలన్నింటినీ చెల్లిస్తామని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థి సంఘాలకు ఇచ్చిన హామీ నేటి వరకు నెరవేరలేదు. ఫీజులను విడుదల చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నందున కళాఽశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తీసుకువస్తున్నాయి.
– కటారుకొండ సాయికుమార్, రాష్ట్ర కార్యదర్శి, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం
ప్రభుత్వం పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు నిర్ణీత సమయంలోగా ఫీజులను చెల్లించకపోతే వారి చదువులు ఎలా సాగుతాయి. చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై దృష్టి సారించకపోవడంతో విద్యారంగం ఒడిదొడుకులను ఎదుర్కోంటోంది. అనేక మంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. 2024–25 విద్యా సంవత్సరంతో పాటు 2023–24 బకాయిలను కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి.
– కే భాస్కర్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపు ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలన్నింటిని విడుదల చేస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ నేటికి నేరవేరలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.6,400 కోట్లను విడతల వారీగా విడుదల చేస్తున్నామని పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు, కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయ కూడా విడుదల చేయలేదు. కూటమి నాయకులకు చెందిన అనేక కళాశాలలు ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికేట్లు ఇస్తామని తెగేసి చెబుతున్నాయి. దీంతో పేద విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి వెంటనే ఫీజు రీయంబర్స్‌మెంట్, ఉపకార వేతనాలను విడుదల చేయాలి.
– డీ సోమన్న, ఏఐఎస్‌ఎఫ్, జిల్లా అధ్యక్షుడు
ఉద్యమం చేస్తాం
ఉద్యమం చేస్తాం


