అన్ని రకాల పత్తిని కొనుగోలు చేయాలి
● జాతీయ రహదారిపై రాస్తారోకో
ఎమ్మిగనూరుటౌన్: సీపీఐ అధికారులు అన్ని రకాల పత్తిని కోనుగోలు చేయాలని రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు హనుమంతు డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలోని శివమూర్తి పత్తి మిల్లు వద్ద శుక్రవారం జాతీయరహదారిపై రైతులతో కలిసి రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. పత్తిని కొనుగోలు చేయకుండా ఒక్క రైతును కూడా వెనక్కి పంపకూడదన్నారు. రాస్తారోకో అనంతరం సీసీఐ అధికారితో మాట్లాడారు. రైతులందరికీ గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరారు. రైతు సంఘ నాయకులు నరసింహులు, దేవపుత్ర, రాఘవరెడ్డి, నరసింహులు, రాముడు పాల్గొన్నారు.


