భారీగా గంజాయి మొక్కలు పట్టివేత
పొలంలో గంజాయి మొక్కలను పరిశీలిస్తున్న సీఐ రవిశంకర్ రెడ్డి, ట్రాక్టర్‌లో తరలిస్తున్న దృశ్యం
చిప్పగిరి: మండలంలోని డేగులహాలు గ్రామంలో భారీగా సాగు చేసిన గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించారు. సీఐ రవిశంకర్ రెడ్డి తెలిపిన వివరాలివీ.. గ్రామంలోని సర్వే నంబర్లు 173, 176లలో కందితో పాటు మిరప పైర్లలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ సతీష్ కుమార్ పోలీసులతో కలిసి ఆయా పొలాల్లో తనిఖీలు నిర్వహించారు. రెండు సర్వే నంబర్లలోని దాదాపు 15 ఎకరాల్లో గ్రామానికి చెందిన శివయ్య సాగు చేస్తున్న కంది, మిరప పొలాల్లో గంజాయి మొక్కలను గుర్తించారు. మొక్కలు అక్కడక్కడ ఉండడంతో కూలీల సాయంతో సేకరిస్తున్నారు. మొక్కల బరువు ఇతర వివరాలను పంచనామా అనంతరం వెల్లడిస్తామని సీఐ తెలిపారు. పొలం సాగు చేస్తున్న వ్యక్తి పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. తహసీల్దార్ ఇజాజ్ అహ్మద్, ఏడీఏ చెంగల్‌రాయుడు, ఎకై ్సజ్ సీఐ లలిత పంచనామా నిర్వహించారు.
భారీగా గంజాయి మొక్కలు పట్టివేత


