మహానందిలో వీకెండ్‌ సందడి | - | Sakshi
Sakshi News home page

మహానందిలో వీకెండ్‌ సందడి

Jun 15 2025 7:22 AM | Updated on Jun 15 2025 7:22 AM

మహానం

మహానందిలో వీకెండ్‌ సందడి

మహానంది: వీకెండ్‌ కావడంతో మహానంది ఆలయం శనివారం భక్తులతో కళకళలాడుతుంది. వేసవి సెలవులు ముగిసినా వీకెండ్‌ కావడంతో పలు ప్రాంతాల భక్తులు ఆలయానికి చేరుకుని రుద్రగుండం, బ్రహ్మగుండం, విష్ణుగుండం కోనేరుల్లో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారు. కోదండరామాలయం, వినాయకనంది, గరుడనంది క్షేత్రాలను సందర్శించి రాతి నంది, పెద్దనంది విగ్రహాలను తిలకించి భక్తులు సేదతీరారు.

రాష్ట్రస్థాయి అంధుల చెస్‌ పోటీలు ప్రారంభం

నంద్యాల(న్యూటౌన్‌): స్థానిక అంధుల సంక్షేమం వసతి గృహంలో శనివారం రాష్ట్రస్థాయి అంధుల చెస్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆల్‌ ఇండియా చెస్‌ ఫెడరేషన్‌ ఫర్‌ బ్లైండ్‌ అనుబంధం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో రెండవ రాష్ట్రస్థాయి అంధుల చెస్‌ పోటీలు రెండు రోజుల పాటు జరుగనున్నాయి. పోటీలను రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ రామకృష్ణారెడ్డి, మంత్రి తనయుడు ఫిరోజ్‌, నంద్యాల జిల్లా చెస్‌ సంఘం అధ్యక్షుడు రవికృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంధులు ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో రాణించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ క్రీడా కోట దివ్యాంగులకు అవకాశం కల్పిస్తూ ప్రోత్సహిస్తుందన్నారు. అనంతరం రాష్ట్రస్థాయి చెస్‌ పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. క్రీడాకారులకు భవనాశి నాగమహేష్‌ భోజన వసతి కల్పించారు. కార్యక్రమంలో కల్నల్‌ ఫిలిప్‌, ఖలీల్‌, వలిబాషా, నాగమహేష్‌, జోజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మహానందిలో  వీకెండ్‌ సందడి 1
1/1

మహానందిలో వీకెండ్‌ సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement