ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య

Jun 15 2025 7:22 AM | Updated on Jun 15 2025 7:22 AM

ప్రేమ విఫలమై    యువకుడు ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య

చాగలమర్రి: చిన్నవంగలి గ్రామంలో ఓ యువకుడు ప్రేమ విఫలమై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి వెంకటేశ్వర్లు కుమారుడు చాకలి శ్రీను (20) కూలీ పనులకు వెళ్త జీవనం సాగించేవాడు. శుక్రవారం సమీపంలోని వైఎస్సార్‌ జిల్లా దువ్వూరు మండలం బయనపల్లె గ్రామంలో ఉన్న అవ్వ ఇంటికి వెళ్లి అదే రోజు అర్ధరాత్రి తిరిగి వచ్చాడు. మిద్దైపె నిద్రిస్తున్న తల్లిదండ్రులు శనివారం తెల్లవారుజామున కిందకు వచ్చి చూడగా శ్రీను నిద్రిస్తున్న గదికి గడియ పెట్టుకుని ఉండటంతో అనుమానంతో పగులగొట్ట చూశారు. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో కేకలు వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు తన సెల్‌ ఫోన్‌ను పగులగొట్టి ఇంట్లో ఉన్న నీటి కుండలో వేసిట్లు గుర్తించారు. కాగా ఓ యువతిని కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నాడని, ఆ ప్రేవ వ్యవహారం విఫలమైందని, ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి శ్రీను సెల్‌కు ఎవరో కాల్‌ చేసి బెదిరించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృత దేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలినట్లు ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement