జిల్లా విద్యార్థినులకు సన్‌షైన్ స్టార్ అవార్డులు
కర్నూలు సిటీ: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలల్లో చదువుతూ ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో సన్‌షైన్ అవార్డులను ఇవ్వనున్నారు. ఇంటర్మీడియట్‌లో 7 రకాల గ్రూప్‌లకు ఒక్కో గ్రూప్‌లో అత్యధిక మార్కులు సాధించిన ఒక విద్యార్థికి అవార్డులను రేపు(మంగళవారం) విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అందించనున్నట్లు సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్ టి.శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గూడూరు కేజీబీవీలో ఇంటర్మీడియట్ సెకండియర్ ఎంపీసీ గ్రూప్ చదువుతూ ఉప్పరి సునీత 983 మార్కులు సాధించి సన్‌షైన్ అవార్డుకు ఎంపిక అయ్యారన్నారు. ఓర్వకల్లు కేజీబీవీలో ఎంఈసీ గ్రూప్ చదువుతున్న బోయ హరిత 913 మార్కలు సాధించి, పంచలింగాల కేజీబీవీలో అకౌంట్స్ అండ్ టాక్సెషన్ గ్రూప్‌లో టి.మానస 992 మార్కులు సాధించి అవార్డులకు ఎంపికయ్యారన్నారు.
సర్వీస్ వివరాలతో పదోన్నతులు
కర్నూలు సిటీ: సర్వీసు ప్రొఫైల్ వివరాల ఆధారంగానే భవిష్యత్తులో ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు ఉంటాయని డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో పని చేస్తున్న గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సర్వీస్ ప్రొఫైల్ వివరాలను టీఐఎస్(టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం)ఫేషియల్ యాప్‌లో ఉన్నాయని, మరోసారి సరి చూసుకోవాలని పేర్కొన్నారు. అభ్యంతరాలు ఉంటే సోమవారం సాయంత్రం 5 గంటలలోపు అధారాలతో హెచ్‌ఎం, ఎంఈఓల ద్వారా డీఈఓ ఆఫీస్‌లో అందజేయాలని తెలిపారు.
జిల్లా విద్యార్థినులకు సన్‌షైన్ స్టార్ అవార్డులు
జిల్లా విద్యార్థినులకు సన్‌షైన్ స్టార్ అవార్డులు


