నిప్పుల్లో కాలుతూ.. చల్లని గాలినిస్తూ!
ఒక్కటేమిటి.. ఇలా చెప్పుకుంటూ పోతే నాతో బోలెడు ఉపయోగాలు. ఎన్నో ఏళ్లుగా నీడనిస్తూ, ఆరోగ్యాన్ని పంచుతున్న నన్నెందుకిలా కాల్చేస్తున్నారు. కడుపులో అగ్గిపెట్టి నిలువునా దహించివేస్తున్నారు. మీ ఊపిరి నిలుపుతున్నందుకా? మీ ఉనికిని కాపాడుతున్నందుకా? తరతరాల నేస్తం.. కాలరాయకు పచ్చదనం.
శ్రీ మద్దిలేటి నరసింహ స్వామి ఆలయానికి వెళ్లె రహదారిలోని ఓ పంట పొలంలో వేప చెట్టు మంగళవారం అగ్నికి ఆహుతైంది. చెట్టు మొదలుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పచ్చని భారీ వృక్షం నిప్పుల్లో వణికిపోతున్న దృశ్యం ప్రకృతి ప్రేమికులను కలచివేసింది.
– బేతంచెర్ల
వర్షం పడుతుందంటారు..
పరుగుతీస్తూ నా పంచన తలదాచుకుంటారు..
మండుతున్న ఎండలంటారు..
వెతుక్కుని మరీ నా నీడన సేదతీరుతారు..
పిల్లలు ఏడుస్తున్నారంటారు..
నా కొమ్మలకు ఊయలకట్టి జోల పాడతారు..
వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతారు..
నా గాలి పీల్చుకొని ఊరట పొందుతారు..
పంటి నొప్పితో బాధ పడతారు..
వేప పుళ్లతో తోముకొని కుదుటపడతారు..
ఒళ్లంతా అనారోగ్యమంటారు..
లేలేత ఆకులతో నయమైందంటారు..


