టీబీ డ్యామ్‌కు 5,215 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
● అకాల వర్షాలతో జలాశయానికి నీరు రాక ● 7.310 టీఎంసీలకు చేరిన నీటి నిల్వలు
హొళగుంద: కర్ణాటక రాష్ట్రం హొస్పేట్ వద్ద నిర్మించిన తుంగభద్ర జలాశయానికి (టీబీ డ్యాం) మూడు నెలల తర్వాత మంగళవారం ఇన్‌ఫ్లో మొదలై 5,215 క్యూసెక్కుల నీరు జలాశయానికి వస్తున్నాయి. ఎగువ భాగంగలో వర్షాలు తగ్గడంతో జనవరి నుంచి జలాశయానికి ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. ఆ సమయంలో 77.776 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ఇన్‌ఫ్లో లేకపోవడంతో ప్రస్తుతం 7.310 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. వేసవి మొదలవడం, సాగు నీటి డిమాండ్ పెరగడంతో నీటి నిల్వల్లో నుంచి రోజుకు ఒక టీఎంసీ వరకు తగ్గుతూ వస్తోది. కాగా డ్యాం ఎగువ భాగంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో మంగళవారం 5,215 క్యూసెక్యుల ఇన్‌ఫ్లో ఉంది. టీబీ బోర్డు అధికారులు ఈనెల 10న ఎల్లెల్సీకి నీటి సరఫనాను నిలిపేయాల్సి ఉండగా మరో రెండు వారాలు కొనసాగించే అవకాశాలున్నాయి.
ఎల్లెల్సీలో తగ్గిన నీటిమట్టం
తుంగభద్ర దిగువ(ఎల్ల్సెల్సీ) కాలువ హొళగుంద సెక్షన్‌లో మంగళవారం దాదాపు రెండడుగుల మేర నీటిమట్టం తగ్గింది. కర్ణాటక కోటా నీరు ఈ నెల 5కే ముగియడంతో పాటు అక్కడి రైతులకు నీటి అవసరం లేకపోవడం తదితర కారణాల వల్ల టీబీ బోర్డు అధికారులు ఆంధ్ర కోటా నీరును మాత్రమే వదిలి కర్ణాటక కోటా నీటిని బంద్ చేశారు. దీంతో కాలువలో నీటిమట్టం తగ్గింది. వేసవి కావడం, టీబీ డ్యాంలో నీటి మట్టం పడిపోతుండండంతో మరికొద్ది రోజుల్లో ఎల్లెల్సీకి నీటి సరఫరాను పూర్తిగా నిలిపి వేయనున్నారు. అందులో భాగంగా ఇప్పటి నుంచే కాలువకు నీటిమట్టాన్ని తగ్గిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయిలో నీరు చేరడంతో దిగువ కాలువ(ఎల్లెల్సీ) కింద రైతులు రెండు కార్ల పంటలు పండిస్తున్నారు. ఈ నెలాఖరికి రబీ కోతలు ప్రారంభం కాన్నాయి.
టీబీ డ్యాంలో నీటి నిల్వ
టీబీ డ్యాంలో మంగళవారం ఉదయం 1,633 అడుగులకు గాను 1584.98 అడుగులతో 105.788 టీఎంసీలకు గాను 7.310 టీఎంిసీల నీరు నిల్వ ఉండగా ఇన్‌ఫ్లో 5,215 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో రూపంలో 4,202 క్యూసెక్కుల నీటిని వివిధ కాలువలకు విడుదల చేస్తున్నారు. గతేడాది ఇదే సమయానికి టీబీ డ్యాంలో 4.117 టీఎంసీలు మాత్రమే ఉండేది. ఇక ఎల్లెల్సీ పరిధిలో ఆంధ్ర కాలువ ప్రారంభం (హన్వాళ్ సెక్షన్) 250 కి.మీ వద్ద 622 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది.
హొస్పేట్ వద్ద ఉన్న టీబీ డ్యామ్‌లో తగ్గిన నీటిమట్టం


