ఆరోగ్యశ్రీ సేవలు నేటి నుంచి బంద్
కర్నూలు(హాస్పిటల్): పేదలు ఆరోగ్యశ్రీ కార్డు జేబులో పెట్టుకుని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా అధునాతన వైద్యం అందుకునే రోజులు పోయాయి. ఈ పథకాన్ని సమూలంగా తీసివేసి దాని స్థానంలో బీమా తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. బకాయిలు చెల్లించలేదంటూ నెట్‌వర్క్ ఆసుపత్రులు సోమవారం నుంచి ఎన్‌టీఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) సేవలు నిలుపుదల చేస్తున్నాయి. ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి సమ్మె నోటీసు కూడా అందజేశాయి.
ఇదీ పరిస్థితి..
● కర్నూలు జిల్లాలో మొత్తం 6,49,333 ఎన్‌టీఆర్ వైద్యసేవ కార్డులు ఉండగా 128 నెట్‌వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. ఇందులో ఐదు ప్రభుత్వ ఆసుపత్రులు, ఒక ఏరియా ఆసుపత్రి, ఐదు సీహెచ్‌సీలు, 58 ప్రైవేటు హాస్పిటల్స్, 34 పీహెచ్‌సీలు, 25 డెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి.
● నంద్యాల జిల్లాలో మొత్తం 5,36,887 ఎన్‌టీఆర్ వైద్యసేవ కార్డులుండగా, 101 నెట్‌వర్క్ హాస్పిటల్స్ కొనసాగుతున్నాయి. ఇందులో 65 ప్రభుత్వ ఆసుపత్రులు 24 ప్రైవేటు ఆసుపత్రులు, 12 డెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి.
● ప్రైవేటు నెట్‌వర్క్ ఆసుపత్రులు ఈ నెల 7వ తేఈ(సోమవారం) నుంచి ఎన్‌టీఆర్ వైద్యసేవలు నిలిపివేస్తున్నాయి.
● రాష్ట్ర వ్యాప్తంగా రూ.3,500కోట్ల బకాయిలు ప్రైవేటు ఆసుపత్రులకు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయమై పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఎలాంటి స్పందన లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు వెళ్తున్నట్లు నెట్‌వర్క్ ఆసుపత్రులు చెబుతున్నాయి. అత్యవసర సేవలను కూడా బహిష్కరించనున్నట్లు తెలిపాయి.
స్పందించని ప్రభుత్వం
ఎన్‌టీఆర్ వైద్యసేవ సేవలను సోమవారం నుంచి నిలిపివేసేందుకు ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రులు నిర్ణయం తీసుకోగా దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కనీసం ప్రత్యామ్నాయ చర్యలకూ ఉపక్రమించలేదు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యసేవలు నిలిచిపోతే అక్కడ చికిత్స చేయించుకోవడానికి డబ్బులు లేని నిరుపేదలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వస్తారు. ఈ మేరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎలాంటి చర్యలూ తీసుకునేందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వలేదు. జిల్లా ఆరోగ్యశ్రీ అధికారులకు సైతం సమ్మె విషయమై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడం గమనార్హం.
గతంలో మహా నగరాల్లోనూ ఉచిత వైద్యం
ఆరోగ్యశ్రీ పేరు చెబితే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గుర్తుకు వస్తారు. ఆయన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకానికి వన్నెలు అద్దారు. ఆరోగ్యశ్రీ కేసుల సంఖ్యను 3,200లకు పెంచారు. అలాగే నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఖ్యను పెంచి పేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చారు. హైదరాబాద్, బెంగళూరు, చైన్నె వంటి నగరాల్లోనూ ఈ పథకం ద్వారా పేదలు ఉచితంగా వైద్యం అందుకునేలా చేశారు.
ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టని
ప్రభుత్వం


