మధురానగర్(విజయవాడసెంట్రల్): జైలులో ఉన్న కాలంలోనే ఖైదీలు పూర్తి సత్ప్రవర్తన కలిగి పరిపూర్ణ వ్యక్తులుగా మారాలని 2వ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ఎం.సునీల్‌కుమార్ సూచించారు. జిల్లా కారాగారంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ‘ఖైదీల సంక్షేమ దినోత్సవం’ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో సునీల్‌కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరివర్తన కోసం ఖైదీలు గాంధీ సిద్ధాంతాలను అలవర్చుకోవాలని సూచించారు. ఆయన సూచించిన సత్యం, అహింసలను అలవర్చుకుని పయనించాలన్నారు. ఖైదీలందరూ సత్ప్రవర్తనతో మెలిగి ఉండాలన్నారు. అనంతరం ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా జైలు పర్యవేక్షణాధికారి మహమ్మద్ ఇర్ఫాన్, జైలర్ ఎన్.గణేష్ జిల్లా కారాగార వైద్యాధికారి రోషన్ మియాన్, జైలర్ ఎన్.గణేష్, సీహెచ్ వేణుౖ, డెప్యూటీ జైలర్స్ గోపయ్య నాయక్ జైలు సిబ్బంది పాల్గొన్నారు.


