గాంధీ, శాస్త్రి మార్గదర్శకులు | - | Sakshi
Sakshi News home page

గాంధీ, శాస్త్రి మార్గదర్శకులు

Oct 3 2026 1:44 AM | Updated on Oct 3 2026 1:44 AM

చిలకలపూడి(మచిలీపట్నం): దేశభక్తికి ప్రతీక మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి అని కృష్ణా కలెక్టర్‌ డీకే బాలాజీ కొనియాడారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా శుక్రవారం మచిలీపట్నం కలెక్టరేట్‌లోని సమావేశం హాలులో జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టర్‌ బాలాజీ.. గాంధీ, శాస్త్రి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ సత్యం, అహింస, శాంతి మార్గాలను పాటిస్తూ దేశ స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించారన్నారు. గాంధీజీ ఆశయాలు నేటి సమాజానికి మార్గదర్శకమన్నారు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి నిరాడంబరత, నిజాయతీ, దేశభక్తికి ప్రతీకగా నిలిచారని, ప్రధాన మంత్రిగా దేశానికి విశిష్ట సేవలందించారని కొనియాడారు. ఆయన ఇచ్చిన జై జవాన్‌, జై కిసాన్‌ నినాదం దేశ రక్షణ, వ్యవసాయ రంగాల ప్రాధాన్యతను చాటి చెప్పిందన్నారు. ప్రజాసేవలో ఉన్న అధికారులు, సిబ్బంది గాంధీజీ సత్యం, అహింస, సేవా భావనతో పాటు శాస్త్రి నిరాడంబరత, క్రమశిక్షణ, అంకిత భావాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో కేఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీ పి. నీలకంఠేశ్వరరెడ్డి, కలెక్టరేట్‌ ఏవో ఏఎస్‌ఎన్‌ రాధిక, సూపరింటెండెంట్‌ నెల్సన్‌పాల్‌బాబు, డెప్యూటీ తహసీల్దార్‌ సుభాష్‌, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement