చిలకలపూడి(మచిలీపట్నం)/చల్లపల్లి: కృష్ణా జిల్లా పరిషత్‌కు పలు అంశాల్లో అవార్డు లభించింది. గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛత అవార్డును జెడ్పీ సీఈఓ డాక్టర్ జె.అరుణ సీఎం చంద్రబాబు నుంచి అందుకున్నారు.
పారిశుధ్య కార్మికురాలికి అవార్డు
చల్లపల్లి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న సాంతల జయలక్ష్మికి స్వచ్ఛాంధ్ర రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రీన్ అంబాసిడర్‌గా అవార్డు అందుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి పేర్ని మాధవేంద్రరావుఅవార్డు అందుకున్నారు.


