బయో మెడికల్‌ వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

బయో మెడికల్‌ వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు పాటించాలి

Oct 1 2026 9:45 AM | Updated on Oct 1 2026 9:45 AM

లబ్బీపేట(విజయవాడతూర్పు): బయో మెడికల్‌ వ్యర్థాలను ఎలా వేరు చేయాలనే అంశంపై బుధవారం విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్స్‌, డయాగ్నోస్టిక్‌ సెంటర్ల నిర్వాహకులకు అవగాహన సదస్సు జరిగింది. గవర్నర్‌పేటలోని ఐఎంఏ హాలులో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వ ర్యంలో జరిగిన ఈ సదస్సులో పీసీబీ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ పి.శ్రీనివాస్‌ ఆస్పత్రి పరిసరాల్లో బయో మెడికల్‌ వ్యర్థాలపై అవగాహన కల్పించారు. ఏవిధంగా బయో మెడికల్‌ వ్యర్థాలను వర్గీకరణ చేయాలి, వేస్ట్‌ మేనేజ్మెంట్‌ నిబంధనలను వివరించారు. నిబంధనలు పాటించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగా హన కలిగించారు. బయో మెడికల్‌ వ్యర్థాలు, మునిసిపల్‌ కార్పొరేషన్‌ తరలించే సాధారణ వ్యర్థాలతో కలవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. బయోమెడికల్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ రూల్స్‌లో చెప్పిన నియమ నిబంధనలు కచ్చితంగా పాటించా లని సూచించారు. లేనిపక్షంలో సంబంధిత హాస్పిటళ్లు, ల్యాబ్‌లు, డయాగ్నస్టిక్‌ సెంటర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సదస్సులో వీఎంసీ ఏఎంఓహెచ్‌ డాక్టర్‌ గోపాల్‌నాయక్‌, ఐఎంఏ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ వి.ఎన్‌.వరప్రసాద్‌, డాక్టర్‌ అనురూప్‌, బయోమెడికల్‌ వేస్ట్‌ ట్రీట్‌మెంట్‌ ప్రతినిధి వి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement