తల్లికి తల కొరివి పెట్టిన కూతుళ్లు | - | Sakshi
Sakshi News home page

తల్లికి తల కొరివి పెట్టిన కూతుళ్లు

Oct 1 2026 9:45 AM | Updated on Oct 1 2026 9:45 AM

ఆటోనగర్‌(విజయవాడతూర్పు): వృద్ధురాలైన తన తల్లి తుది శ్వాస విడవడంతో కూతుళ్లే తల కొరివి పెట్టిన ఘటన పెనమలూరు మండలం కానూరులో బుధవారం జరిగింది. వివరాలు ఇవి.. కానూరు గ్రామానికి చెందిన ముదిగొండ అమ్మ (86) అనారోగ్యంతో మృతి చెందారు. మృతురాలికి కొడుకులు లేరు. నలుగురు కుమార్తెలు. ఒక కుమార్తె గతంలోనే చనిపోయింది. దీంతో తల్లి అంత్యక్రియలను మిగిలిన కుమార్తెల్లో ఇద్దరు కుమార్తెలు భీమవరపు లలితకుమారి, ధర్మవరపు లక్ష్మిరాణి చేతుల మీదుగా జరిగించారు. భీమవరపు లలితకుమారి తల కొరివి పెట్టగా.. మరొక కూతురు ధర్మవరపు లక్ష్మిరాణి పాడె మోశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement