లయోల విద్యాసంస్థల రెక్టార్‌గా ఫాదర్‌ రాయప్ప | - | Sakshi
Sakshi News home page

లయోల విద్యాసంస్థల రెక్టార్‌గా ఫాదర్‌ రాయప్ప

Sep 24 2026 2:42 AM | Updated on Sep 24 2026 2:42 AM

లయోల విద్యాసంస్థల రెక్టార్‌గా ఫాదర్‌ రాయప్ప గిరిపురంలో నీటి శాంపిళ్ల సేకరణ పెట్టుబడి పేరుతో రూ.13 లక్షలకు టోకరా కాలువలో పడి ఒకరి మృతి

గుణదల(విజయవాడ తూర్పు): ఆంధ్ర లయోల విద్యా సంస్థల నూతన రెక్టార్‌గా ఫాదర్‌ రాయప్పను నియమించినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ ఫాదర్‌ మెల్కియోర్‌ తెలిపారు. కళాశాల సమావేశ మందిరంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఫాదర్‌ రాయప్పను అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ పాదర్‌ మెల్కియోర్‌ మాట్లాడుతూ... 1997వ సంవత్సరంలో ఆంధ్రాప్రావిన్స్‌లోని సోసైటీ ఆఫ్‌ జీసస్‌ సంఘంలో ఆయన చేరారని, 2012లో గురువుగా అభిషేకం పొందారని తెలిపారు. అప్పటి నుంచీ లయోల సంస్థలో వైస్‌ ప్రిన్సిపాల్‌గా, విజువల్‌ కమ్యూనికేషన్‌ విభాగాధిపతిగా సేవలందించారని వివరించారు. ఫాదర్‌ రాయప్ప నిబద్ధతకు నిదర్శనంగా లయోల యాజమాన్యం నూతన రెక్టార్‌గా నియమించినట్లు తెలిపారు.

పటమట(విజయవాడతూర్పు): నగరంలోని గిరిపురం ప్రాంతంలో నగరపాలక సంస్థ కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్న నీటి శాంపిళ్లను బుధవారం సేకరించారు. నగరపాలక సంస్థ సరఫరా చేసే తాగునీరు కలుషితమవుతోందని, గిరిపురంలో డ్రెయినేజీ పక్కనే తాగునీటి పైపులైను ఉండటం వల్ల డయేరియా ప్రబలుతోందని పేర్కొంటూ ‘సాక్షి’లో ఈ నెల 21వ తేదీన ‘తాగునీరు సురక్షితమేనా’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన మునిసిపల్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి సురేష్‌కుమార్‌ వీఎంసీ అధికారుల నుంచి నివేదిక కోరారు. ఈ మేరకు మునిసిపల్‌ కమిషనర్‌ ధ్యానచంద్ర, వీఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌ పి.సత్యకుమారి ఆధ్వర్యంలో ప్రజారోగ్యం, ఇంజినీరింగ్‌ సిబ్బంది గిరిపురంలోని ప్రతి ఇంటి నుంచి నీటి శాంపిళ్లు సేకరించారు. స్థానికంగా ఉన్న పలు ఆర్వోప్లాంట్లను తనిఖీ చేశారు. నాటిని పరీక్షించి అనంతరం ప్రభు త్వానికి నివేదిక సమర్పిస్తామని అధికారులు ప్రకటించారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): తన కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో లాభాలు పొందొచ్చంటూ రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగిని రూ.13 లక్షలకు మోసగించిన ఘటనపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. భవానీపురంలో నివ శించే జి.కృష్ణప్రకాష్‌ రైల్వేలో స్టేషన్‌ సూపరింటెండెంట్‌గా పనిచేసి 2019లో ఉద్యోగ విర మణ చేశారు. ఫేస్‌బుక్‌లోని ఓ పేజీలో నిర్మలా సీతారామన్‌, అనీల్‌ అంబానీ, ఇన్ఫోసిస్‌ నారా యణమూర్తి మేసేజ్‌లు చూసి ఆసక్తి పెంచుకున్నారు. ఆ గ్రూపులో రిజిస్ట్రేషన్‌ చేయించుకునే ప్రయత్నం చేయగా రూ.20 వేలు చెల్లించాలని మెస్సేజ్‌ రాగా అకౌంట్‌ నుంచి ఆ మొత్తం జమచేశారు. అనంతరం వేర్వేరు వ్యక్తులు ఫోన్‌లు చేసి తమ కంపెనీల్లో పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో లాభాలు పొందొచ్చంటూ నమ్మబలికారు. అలా తొలుత రూ.40 వేలు, రూ.50 వేలు పెట్టుబడి పెట్టగా, కొంత మొత్తం లాభం పేరుతో ఆయన ఖాతాకు చెల్లిస్తూ నమ్మించారు. అనంతరం ఆరు నెలల వ్యవధిలో వృద్ధుడి నుంచి విడతల వారీగా రూ.13 లక్షలు పెట్టుబడి పెట్టించారు. అనంతరం తనకు రావాల్సిన లాభం గురించి కృష్ణప్రకాష్‌ ప్రశ్నించారు. లభం ఏమీ రాదని బ్యాలెన్స్‌ జీరో అని చెప్పడంతో తాను మోసపోయిట్లు గ్రహించి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సీతానగరం: పార్వతీ పురం – మన్యం జిల్లా సీతానగరం మండలంలోని ఏగోటివలస వద్ద తోటపల్లి కాలువలో గల్లంతైన కృష్ణా జిల్లా లెంక గ్రామానికి చెందిన మధుకోటి హేమంత్‌ కృష్ణ (39) మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..హేమంత్‌ కృష్ణ ఓ శుభకార్యం నిమిత్తం మండ లంలోని ఏగోటివలస బంధువుల ఇంటికి వచ్చాడు. మంగళవారం ఉదయం బహిర్భూమికి వెళ్లేందుకు స్నేహితులు ఎస్‌.పోలినాయుడు తదితరులతో కలిసి కాలువ వద్దకు వచ్చిన హేమంత్‌ కృష్ణ ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. స్థానికుల ద్వారా సమచారం అందుకున్న తహసీల్దార్‌ కె.ప్రసన్న కుమార్‌ పోలీసులు, అగ్నిమాపక, ఇరిగేషన్‌ అధికారులకు సమాచారం ఇవ్వగా.. ఆయా శాఖల పర్యవేక్షణలో గాలింపు చర్యలు చేప ట్టారు. ఈదురు గాలులతో కూడిన వర్షం కుర వడంతో పాటు చీకటి పడడంతో గాలింపు కష్టమైంది. బుధవారం ఉదయం మళ్లీ గాలింపు చేపట్టగా.. బురదలో కూరుకుపోయిన హేమంత్‌ కృష్ణ మృతదేహాన్ని బయటకు తీశారు. విజయవాడ నుంచి వచ్చిన బంధువుల సమక్షంలో హేమంత్‌కృష్ణ శవ పంచనామా చేపట్టి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్రా స్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎం.హేమలత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement