లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వంలో లీజుకు కార్లు పెట్టగా, ఓ అధికారి నిర్లక్ష్యం కార ణంగా తనకు బిల్లులు రాకుండా నిలిచిపోయా యని విజయవాడకు చెందిన ట్రావెల్స్ యజమాని కొల్లూరువెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అధికారి నుంచి తనకు దాదాపు రూ.35 లక్షలు వరకూ రావాలని తెలిపారు. నగరంలోని తన నివాసంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. 2016లో అప్పటి కాపు కార్పొరేషన్ అధికారికి కారును నెలకు రూ.60 వేల చొప్పున అద్దెకు పెట్టినట్లు తెలిపారు. ఆయన సిఫార్సుతో మరికొన్ని కార్లు పెట్టానన్నారు. తనకు 11 నెలల పాటు బిల్లులు ఇవ్వకుండా, అదేమని ప్రశ్నించినందుకు కార్లు లీజునుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన బంధువుకు ఉద్యోగం ఇప్పిస్తానని రూ.5 లక్షలు తీసు కున్నాడని పేర్కొన్నారు. ఉద్యోగం ఇవ్వకపోగా, డబ్బులు తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. ఈ విషయమై ఇప్పటికే పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైందన్నారు. ఆ అధి కారి అవినీతి రోజు రోజుకు పెరిగిపోతుందని, ఇటీవలే మరో కీలక బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి అవినీతి అధికారిపై చర్యలు తీసుకుని, తనకు బకాయిలు ఇప్పించాలని కోరారు. ఈ సమావేశంలో వెంకటేశ్వరరావు కుమారుడు వెంకట నాగేశ్వరరావు పాల్గొన్నారు.


