హజ్‌ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోండి | - | Sakshi
Sakshi News home page

హజ్‌ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోండి

Feb 8 2026 7:12 AM | Updated on Feb 8 2026 7:12 AM

హజ్‌ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోండి

హజ్‌ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోండి

హజ్‌ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోండి

లబ్బీపేట(విజయవాడతూర్పు):హజ్‌ యాత్రికులు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకుని, వ్యాక్సిన్‌ వేయించుకోవాలని, వారి కోసం ప్రభుత్వాస్పత్రిలో వైద్య శిబిరం నిర్వహిహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మాచర్ల సుహాసిని తెలిపారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా శిబిరాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా శనివారం ఆమె శిబిరాన్ని పరిశీలించి మాట్లాడారు. హజ్‌ యాత్రకులకు ఆరోగ్య పరీక్షలు, వ్యాక్సినేషన్‌ వంటి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుని, వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఆమె సూచించారు. వారికి కావాల్సిన హెల్త్‌ కార్డును పరిపూర్ణంగా పూర్తి చేయించుకుని మాత్రమే వెళ్లాలని కోరారు. యాత్రికులు 101 మంది శనివారం నమోదు కాగా, వారిలో 90 మందికి పరీక్షలు పూర్తి చేశామని, ఇద్దరు అనర్హులుగా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఇందుమతి, ఎమర్జెన్సీ మెడిసిన్‌ నిపుణులు డాక్టర్‌ నూరుల్లా, నోడల్‌ ఆఫీసర్‌ ఫాజల్‌ రెహమాన్‌ తదితరులు పాల్గొన్నారు.

– జీజీహెచ్‌లో ప్రత్యేక వైద్య శిబిరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement