డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు):ఎన్టీఆర్ జిల్లాను డ్రగ్స్, గంజాయి వినియోగం పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో జిల్లా పోలీస్‌శాఖ కఠిన చర్యలతో పాటు, మానవతాదృక్ఫథంతో ముందుకు సాగుతున్నట్లు పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు ముఖ్యంగా తల్లిదండ్రులు, తమ పిల్లలు గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్లు అనుమానం కలిగినా, నిర్ధారణ అయినా వెంటనే పోలీస్ అధికారులను సంప్రదించాలని సూచించారు. ముందుగానే పోలీసులను సంప్రదిస్తే గంజాయి మానేందుకు అవసరమైన కౌన్సెలింగ్ , వైద్య చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తగిన సహాయం, మార్గదర్శనం చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే గంజాయి, డ్రగ్స్ వినియోగం, రవాణా , విక్రయం వంటి నేరాల్లో పోలీసులకు చిక్కితే చట్టప్రకారం ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ రహిత భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, సమాజం అందరూ పోలీస్ వారితో సహకరించాలని కోరారు.
ఎన్‌టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు


