ముగిసిన రాష్ట్ర స్థాయి ఖో–ఖో పోటీలు
గుడివాడటౌన్: కృష్ణాజిల్లా గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు జరిగిన రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషులు, సీ్త్రల విభాగం ఖో–ఖో పోటీలు శుక్రవారం ముగిశాయి. మొత్తం 13 జిల్లాల నుంచి ఏపీ పోలీస్ టీమ్‌తో సహా 27 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. రసవత్తరంగా సాగిన ఈ పోటీల్లో ప్రకాశం జట్టు విజేతలుగా నిలిచాయి. పురుషుల విభాగంలో ప్రకాశం జట్టు ప్రథమ, విజయనగరం ద్వితీయ, విశాఖపట్నం తృతీయ, శ్రీకాకుళం నాల్గవస్థానం దక్కించుకోగా మహిళల విభాగంలో ప్రకాశం జట్టు ప్రథమ, కృష్ణా జట్టు ద్వితీయ, చిత్తూరు జట్టు తృతీయ, తూర్పు గోదావరి జట్టు నాల్గవ స్థానం దిక్కించుకున్నాయి. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, స్టేడియం కమిటీ జాయింట్ సెక్రటరి కె. రంగప్రసాదు, ఖో–ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరి సీతారామిరెడ్డి, ఏపీ ఖో–ఖో అసోసియేషన్ అధ్యక్షుడు మడకా ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.


