మామ చేతిలో అల్లుడు హతం
తోట్లవల్లూరు: మామ చేతిలో అల్లుడు దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తోట్లవల్లూరుకు చెందిన చీకుర్తి శ్రీనివాసరావు కుమార్తె ఝాన్సీరాణికి ప్రకాశం జిల్లా గజ్జలకొండకు చెందిన ఆదిమూలపు సురే్‌ష్ (31) తో 2017లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సురేష్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ విజయవాడ సమీపంలోని ప్రసాదంపాడులో ఉంటున్నాడు. ముగ్గురు పిల్లలు అత్త, మామల వద్ద ఉండి చదువుకుంటున్నారు. రెండు నెలల క్రితం మూడేళ్ల వయసున్న సురేష్ కుమార్తె అత్త, మామల ఇంటి వద్ద అనారోగ్యంతో మృతి చెందింది. ఈ నెల 24న సురేష్ భార్య ఝాన్సీరాణితో కలిసి రెండో కొడుకు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ తీసుకుని పెనమకూరు వచ్చాడు. క్రిస్మస్ రోజు సురేష్ మద్యం తాగి తన కుమార్తెను సరిగా చూడకపోవటం వలనే మృతి చెందిందంటూ మామ శ్రీనివాసరావుతో గొడవకు దిగాడు. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీనివాసరావు అల్లుడు సురేష్‌ను కర్రతో బలంగా కొట్డాడు. తలకు బలమైన గాయం కావటంతో ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. సీఐ చిట్టిబాబు హత్య కేసు నమోదు చేశారు.


