గెలుపోటములు సహజం | - | Sakshi
Sakshi News home page

గెలుపోటములు సహజం

Apr 10 2026 10:03 AM | Updated on Apr 10 2026 10:03 AM

రెబ్బెన: క్రీడల్లో గెలుపోటములు సహజమని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. రెబ్బెన మండలం గోలేటిలోని భీమన్న స్టేడియంలో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 37వ వేణుగోపాల్‌ మెమోరియల్‌ ఇన్విటేషనల్‌ రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ గురువారం ముగిసింది. ఫైనల్‌లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన కరీంనగర్‌ జిల్లాకు చెందిన గంగాధర జట్టు 20 ఓవర్లలో 151 పరుగులు చేయగా, అనంత రం మందమర్రి సింగరేణి ఫ్రెండ్స్‌ జట్టు 8 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేయడంలో మ్యాచ్‌ టై అయ్యింది. సూపర్‌ ఓవర్‌లో మందమర్రి జట్టు 9 పరుగులు చేయగా, గంగాధర జట్టు 3 బంతుల్లో 12 పనులు చేసి విజేతగా నిలిచింది. గంగధర జట్టుకు రూ.35 వేల నగదు, కప్పు, మెడల్స్‌, రన్నరప్‌ జట్టుకు రూ.25 వేల నగదు, కప్పు, మెడల్స్‌ అందించారు. ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి ఎస్‌. తిరుపతి, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ వీరన్న, డీజీఎం సివిల్‌ మదీనా బాషా, పర్సనల్‌ హెవోడీ ఎస్‌వీ రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement