ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు విన్నూత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు గురువారం అవార్డులు, స్టార్ ఆఫ్ ద మంత్ పేరుతో ప్రత్యేకంగా బ్యాడ్జీలు అందించినట్లు ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు తెలిపారు. హెచ్‌ఎం ఉమబాల మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను గుర్తించి మరింత రాణించేలా స్టార్ అవార్డుల కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. విద్యార్థుల్లో పోటీతత్వం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.


