రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలి

Apr 10 2026 10:03 AM | Updated on Apr 10 2026 10:03 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: జిల్లాలో మే చివరి వారంలో నిర్వహించే తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్‌ పిలుపునిచ్చారు. పట్టణంలోని సీనియర్‌ సిటిజన్స్‌ సంఘ భవనంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆదివాసీ జిల్లాలో రాష్ట్ర మహా సభలు నిర్వహించడం గొప్ప అవకాశమన్నా రు. రాష్ట్రంలోని ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధివిధానాల గురించి చర్చించనున్నట్లు వివరించా రు. సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌.త్రివేణి, రాజేందర్‌, దినకర్‌, కార్తీక్‌, రాజ్‌కుమార్‌, ఆనంద్‌కుమార్‌, కూశన రాజన్న, మాలశ్రీ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement