ఇసుక రవాణాకు పాత విధానమే కొనసాగించా లని జిల్లాలోని ట్రాక్టర్ యజమానుల సంఘం కోరుతున్నారు. ఆన్‌లైన్ విధానం వద్దని ఈ నెల 7న ఎమ్మెల్యే కోవ లక్ష్మికి వినతిపత్రం సైతం అందించారు. గతంలో రూ.1400 డీడీ చెల్లించి ఇసుక రవాణా చేసే విధానం ఉండగా, ఆన్‌లైన్ విధానంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అమలు ఇబ్బందికరంగా మారిందని, గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలతో ట్రాక్టర్ యజమానులు ఉపాధి కోల్పోతున్నారని చెబుతున్నారు. పాత విధానం కొనసాగించాలని, అప్పటివరకు ఇసుక రవాణా నిలిపి వేస్తామని ట్రాక్టర్ యజమానుల సంఘం స్పష్టం చేసింది.


