రెబ్బెన: ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను గుర్తింపు సంఘం, కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మల్రాజు శ్రీనివాస్‌రావు డిమాండ్ చేశారు. గోలేటి సీహెచ్‌పీలో గురువారం టీబీజీకేస్ ఆధ్వర్యంలో ఫిట్ కార్యదర్శి రమేశ్ అధ్యక్షతన గేట్ మీటింగ్ నిర్వహించారు. శ్రీని వాసరావు మాట్లాడుతూ సింగరేణిలో రాజకీ య జోక్యం పెరిగిందని, కార్మికులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. అన్‌ఫిట్ కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టడంతో వేలాది కుటుంబాలు అయోమయంలో ఉన్నాయని తెలిపా రు. ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీలో సింగరేణిలో ఉద్యోగులు ఎక్కువయ్యారని అనడాన్ని ఖండిస్తున్నామన్నారు. నాయకులు మంగీలాల్, వెంకటేశ్, కిరణ్, శ్రీనివాస్, బొంగు వెంకటేశ్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


